ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయి అంటే.. ఏమిటో ఇప్పుడర్థమవుతోంది. వీరిని చూశాక..!
ఒలింపిక్స్ లో పతకాలు రాకపోయినా మనం ఎందరినో ఆశగా పంపుతున్నాం. వచ్చిన కొద్ది వాటికే.. ఎంతో సంతృప్తి పడుతున్నాం.
రాని వాటికి బాధపడకపోయినా ఫర్లేదు కానీ, వచ్చిన వాళ్లనీ చిన్నచూపు చూడడం ఎంత వరకూ సమంజసం?
సీతా సాహూ (స్ప్రింటర్)
నిషా రాణీ దత్తా (ఆర్చరీ)
రష్మితా పాత్రా (ఫుట్ బాల్)
నౌరీ ముందు (హాకీ)..
పేర్లు తెలుసా?
కనీసం విన్నట్టయినా అనిపించిందా..!
ఒకప్పుడు మనదేశానికి ప్రాతినిధ్యం వహించి, కీర్తిని సాధించిపెట్టారు. మరి వీరి ప్రస్తుత పరిస్థితేంటి?
సీతా సాహూ.. మధ్యప్రదేశ్ కు చెందిన ఈమె.. ఏథెన్స్ స్పెషల్ ఒలింపిక్స్ 2011లో 15 ఏళ్ల వయసులో 200, 1600 మీటర్ల పరుగు పందెంలో దేశానికి రెండు రజత పతకాలు సాధించింది. ఇప్పుడు ఆదరణ కరవై, జీవనోపాధి కోసం పానీపూరీ అమ్ముకుని జీవనం సాగిస్తోంది.
ఇది ఒకప్పుడు. మరి ప్రస్తుతం.. ఆదరించేవారు లేక, శిక్షణ తీసుకోవడానికి స్థోమతలేక అజ్ఞాతంలో మిగిలిపోయింది. తన గురువు బహుమతిగా ఇచ్చిన విల్లును కూడా భారీ వర్షాలకు కూలిపోయిన తన ఇంటికోసం అమ్మేయాల్సి వచ్చింది.
రష్మితా పాత్ర.. 2008లో కౌలాలంపుర్, మలేసియాలో జరిగిన ఏషియన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ అండర్ వుమెన్స్ విభాగంలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. 2011లో గల్ఫ్ దేశమైన బహ్రైన్ లో సీనియర్ ఏఎఫ్.సీ క్వాలిఫయింగ్ రౌండ్ లో భారత్ విజయానికి తోడ్పడింది.
ఒరిస్సాకు చెందిన ఈ క్రీడాకారిణి ప్రస్తుతం పాన్ షాప్ ను నిర్వహిస్తూ.. ఉపాధి పొందుతోంది.
ప్రస్తుతం ఒక ఎన్జీవో సంస్థలో టీచర్. నెలకు రూ. 5000 జీతం.
మనదేశంలో క్రీడలకూ, క్రీడకారులకూ ఉన్న ప్రాముఖ్యం ఏంటో వీరిని చూస్తే అర్థమవుతోంది కదూ..! అలా అని.. అందరూ ఇలాగే ఉన్నారనుకుంటే.. పొరపాటే.
మరి వీళ్లకీ.. వాళ్లకీ తేడా ఏంటంటే.. సమాధానం డబ్బు. కొంచెం శిక్షణ ఇప్పించగల నేపథ్యం ఉన్నవారు ముందుకు సాగుతున్నారు. లేనివారు ఎవరి ప్రోద్బలంతోనైనా వెలుగులోకి వచ్చినా.. తరువాత సాయం కరవై ఇలా మిగిలిపోతున్నారు.
క్రికెట్ కు మనవాళ్లు చాలా ప్రాముఖ్యం ఇస్తారు. వాళ్లకి ఎన్నో సదుపాయాలు కల్పిస్తారు. వారు ఆడినా.. ఆడకపోయినా! అందరినీ అలా చూడకపోయినా.. కనీసం గౌరవం అయినా అందేలా చూడాలి కదా!
రాని వాళ్లని సానబెట్టి పతకాలు సాధించడానికి ప్రయత్నిస్తున్నపుడు.. ప్రభుత్వ సాయం లేకుండానే తనను తాను నిరూపించుకున్న వీళ్లను ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా, కనీసం జీవనోపాధికి చేయూతనిస్తూ.. అర్హులకు మరింత రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుండు.
లేదంటే.. భవిష్యత్తులో క్రీడలంటే.. డబ్బున్న వాళ్లకే అనే అభిప్రాయం నెలకొనడం ఖాయం.
No comments:
Post a Comment