Thursday 12 March 2015

'తెలుగు వెలుగు'లో నా కథ..

ఫీసులో పనిచేసుకుంటున్నపుడు అకస్మాత్తుగా వచ్చిన ఆలోచనే ఈ నా కథ. ఆలోచన రాగానే మొదట దానిని వర్డ్ పాడ్ లో రాసేశాను. ఎందుకంటే.. వెంటనే రాయకపోతే నేను మరచిపోతాను. పైగా పేపర్ మీద నేను రాయలేను. సిస్టమ్ కు బాగా అలవాటు పడడమే కారణమై ఉండొచ్చు.


దీనిని ఒక రూపుకు తీసుకురావడానికి మాత్రం చాలా సమయం తీసుకుంది.


ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే.. నేను నా కథకు ‘మనసు బంధం’ అని పేరు పెట్టుకున్నాను. కానీ మా మిత్రులు శీర్షిక మరీ నేరుగా ఉంది, మార్చు.. అన్నారు. దాంతో ‘ఎదలో లయ’ అని పెట్టి ‘తెలుగు వెలుగు’కు పంపాను. విచిత్రమేమిటంటే.. తెలుగు వెలుగు వారు తిరిగి నా కథకు ‘మనసు బంధం’ అనే పెట్టారు. నేను పంపిన మెయిల్ ను తిరిగి చూసుకున్నాను. బహుశా రెండు పేర్లు పంపితే ఒకటి ఎంపిక చేశారేమోనని. కానీ ఎదలోలయ అనే ఉంది.


నా కథకు ఇదే సరిపోతుంది అని నేను మనస్ఫూర్తిగా పెట్టుకున్న పేరు.. తిరిగి వారి ద్వారా ఆ పేరుతోనే రావడం యాదృచ్ఛికమే అయినా చాలా ఆనందాన్నిచ్చింది.











4 comments:

Anonymous said...

కథ చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు చిమ్మి చాలాకాలమయ్యింది. బాగా నచ్చిందండి. చిన్నప్పుడు నేను కూడా నా పేరుక్రింద పిల్లనగ్రోవి, నెమలీక వేసేవాడిని. కానీ ఈ మురళి అంత అందమైన హ్యాండ్‌రైటింగ్ మాత్రం కాదు.

anu said...

Thank you muralidharnamala గారూ.. అవునా.. ఈ పిల్లనగ్రోవి, నెమలీక నా మనసులోకి ఎలా వచ్చిందో నాకూ తెలియదు. ఇంతవరకూ చూడనూలేదు. వీలుంటే.. ఓసారి పంపించగలరా? చూడాలని ఉంది.

Anonymous said...

చేతితో వేసి పంపటానికి ఇక్కడ ఇమేజ్ అటాచ్ చేసే అవకాశంలేదు. గూగుల్‌లో దొరికిన ఇమేజ్ లింక్ ఇస్తున్నా చూడండి. ఇదే మోడల్ స్కూల్‌లో నా సైకిల్ వెనుక స్టిక్కరింగ్ కూడా వేయించాను. ఇదే కలర్స్, లేకుండా పెన్‌తో అష్టవంకరలతో వేస్తే అదే నేను వేసినది అవుతుంది

https://s-media-cache-ak0.pinimg.com/564x/59/4f/c5/594fc56981ef667314d51e09f5f25b51.jpg

anu said...

అడగగానే ప్రయత్నించినందుకు థాంక్స్ muralidharnamala గారూ.. చాలాబాగుంది. మీరు వేసింది ఊహించుకోవడానికి ప్రయత్నించాను.. మ్... కానీ, విఫలమయ్యాను. మరోసారి థాంక్యూ..

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...