Tuesday 6 September 2016

హీరోయిజం కాదు.. గ్యారేజీ కనిపించింది! (జనతా గ్యారేజ్ రివ్యూ)




సూపర్ హిట్.. యావరేజ్.. 76%.. ఇంకాస్త ఉండాలి.. కామెడీ లేదు.. హీరోయిన్లదేం లేదు.. ఇదీ జనతా గ్యారేజ్ సినిమా గురించి వినిపిస్తున్న విభిన్న కామెంట్లు.. మరి నా కామెంటేంటి..?


ముందు కథ విషయానికొస్తే.. నేను కొత్తగా చెప్పేదేముంది! కొరటాల శివ అదే- డైరెక్టర్ తన టీజర్ ద్వారానే మొత్తం కథను చెప్పేశాడు. ఇక మొత్తం చెప్పేసేశాక సినిమా చూసేదేముందంటే- ఒక ప్రకృతి ప్రేమికుడికీ, కష్టాల్లో ఉన్నవాళ్లకీ సాయపడే వ్యక్తికీ మధ్య లింక్ ఎలా కుదిరిందనేదే!

సినిమాకి వెళ్లే ప్రతీ ఒక్కరూ ఈ విషయాన్ని ఎలా చూపించారా? ఇద్దరి హీరోయిన్ల పాత్రేమిటా అని తెలుసుకోవడానికే వెళతారు. టీజర్ అనేది తెలియని వాళ్లు ఇక్కడ ఎక్సంప్షన్. ఇక తారక్ అభిమానులైతే.. ఇంకో సెంటిమెంట్ ను కూడా పెట్టుకున్నారు. గత పుష్కరాలపుడు సింహాద్రి, ఇపుడూ అలాగే ఉంటుందని!

ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. మాస్ హీరోగా పేరున్న జూనియర్ ఎన్.టి.ఆర్ గత రెండు సినిమాలు- టెంపర్, నాన్నకు ప్రేమతోలతో తన పంథాను మార్చుకున్నాడు. మాస్ ఇమేజ్ చట్రం నుంచి కొంచెం పక్కకు వచ్చాడు. కాబట్టి ఇక దీనిలో ఏం చేశాడా అని!

కథ తెలిసిపోయింది. ఇక ఎవరెలా చేశారు అనేదే చెప్పుకోవాలి.. తారక్.. ఇప్పుడున్నయంగ్ జనరేషన్ హీరోల్లో ఎవరు బాగా చేస్తారు అని ఎవరినడిగినా చెప్పే పేరు. హీరోయిన్లు- సమంత, నిత్యామేనన్.. ఎవరినడిగినా వాళ్ల పరిధిమేరకు బాగానే చేశారని. మోహన్ లాల్.. పెద్ద నటుడు, నేషనల్ అవార్డు గ్రహీత. ఇక ఆయన నటనను నేను అంచనా వేయగలనా?

మరి మ్యూజిక్..! దేవిశ్రీ ప్రసాద్.. పాటలంటే మాటలా.. అవి సూపర్. డైరెక్షన్- కొరటాల శివ.. చేసింది రెండే.. కానీ మంచి పేరుంది. కొత్త అంటే కెమెరామెన్- తిరు. ఎవరికివారు చాలా బాగా చేశారు
 

ఇక మరి సినిమా గురించి చెప్పేదేముంది! తిరిగి నటీనటుల దగ్గర్నుంచే రావాలి. ఎన్టీఆర్.. ఏ పాత్రలోనైనా జీవించేయగలడు.. ఎన్ని షేడ్స్ అయినా చూపించగలడు. తెలిసిన విషయమే అయినా.. పక్కన ఉన్నది నేషనల్ అవార్డు గ్రహీత- మోహన్ లాల్. ఒక సీన్ నుంచి వేరే సీన్ కు మారేటప్పటికి భావోద్వేగాల్లో ఎన్నో మార్పులుంటాయి. కానీ ఆనంద్ పాత్ర వేరు. సినిమా మొత్తం కూల్ గా ఉంటాడు. తారక్ ను ఇలా ఏ సినిమాలోనూ చూపించలేదు. ఎంతలా నటించాడంటే- సినిమా అంతటినీ ఏకబిగిన తీశారా అన్నట్టు దాన్ని మెయింటెయిన్ చేశాడు. ఇంతవరకూ తనలో చూడని కొత్తదనం కనిపిస్తుంది. మోహన్ లాల్, తారక్ మధ్య వచ్చే సన్నివేశాల్లో అయితే, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక హీరోయిన్లు పాత్ర పరిధి చిన్నది కానీ, ఉన్నంతవరకూ బాగా చేశారు. అలా అని అలా వచ్చిపోయే పాత్రలు మాత్రం కాదు. దీనిలో రాజీవ్ కనకాల ఒక పాత్ర పోషించాడు. చిన్నదే కానీ పాత్రను తీర్చిదిద్దిన విధానం అక్కడి సంభాషణలూ ఆకట్టుకుంటాయి.

పాటలు దేవిశ్రీ బాగా రూపొందించాడు. కానీ, అన్నింటినీ రామజోగయ్యశాస్త్రే రాశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రణామం.. ప్రణామం రాసి, పక్కా లోకల్.. రెండూ ఒకరే రాయగలిగారంటే మరి ఆశ్చర్యమే కదా!

మైనస్ లు చెప్పగలిగేంత సినిమా పరిజ్ఞానమైతే లేదు కానీ.. ఒక్కటి చెప్పగలను. ఇది కేవలం హీరోను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ మాత్రం కాదు. హీరోని మాత్రమే ఎత్తి చూపుతూ.. మిగతా వాళ్లను చిన్న వాళ్లగా చూపించే రోటీన్ చిత్రమూ కాదు. చూస్తున్నంతసేపూ ఎక్కడో నిజంగా జరుగుతున్నదాన్ని మనం చూస్తున్నామన్న భావన మాత్రం కలుగుతుంది. సంభాషణలు కూడా హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా కావాలని రాసినట్టుండవు. చాలా సాధారణంగా, మనసుకు హత్తుకునేలా రాశారు రచయిత. తారక్ డాన్సులు కూడా చాలా ఆకట్టుకుంటాయి. వాటికి అనుబంధంగా వెనుక బ్యాక్ గ్రౌండ్ కళ్లకు విందే..

ఒక పోటాపోటీ నటన చూడాలనుకుంటే జనతా గ్యారేజ్ ను చూడాల్సిందే. ఎంతలా అంటే సాయికుమార్ కూడా కనిపించలేదు.. తారక్, మోహన్ లాల్ ల ముందు

 

కామెడీ లేదు.. హీరోయిన్ పాత్ర తగ్గింది.. ఇలా నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే.. నా వరకైతే తారక్, మోహన్ లాల్ కనిపించలేదు.. ఆనంద్, సత్యం.. వాళ్ల మనుషులు, వాళ్ల జీవితాలు ఇలాగే అనిపించింది!

6 comments:

Anonymous said...

Well said.

anu said...

Thank you.. bonagiri garu..

COMMON MAN said...

Unnadi....annattu chepparu.....hats off anusha garu

anu said...

Thank you COMMON MAN garu..

cbrao said...

మీ సమీక్ష ఆచితూచి రాసినట్లు balanced గా ఉంది; సినిమా చూడాలనే ఆసక్తి కలిగించేలా.

anu said...

Thank you Cbrao garu..

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...