Friday 11 August 2017

ఏదో జరుగుతోంది.. (ఫిదా)

ఈ మధ్య కాలంలో నాకు చాలాసార్లు వినాలనిపించీ, ఎన్నిసార్లు విన్నా.. విసుగనింపించని పాట ఇది.  ఈ పాట ఫిదా సినిమాలోది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించిన సాహిత్యానికి, సంగీత దర్శకుడి నేపథ్య సంగీతం చక్కగా తోడైంది.. అందుకే ఆ సాహిత్యాన్ని ఇక్కడ అందించాలనిపించింది.






తనలో ఉన్నదేదో.. ఎదురుగానే ఉన్నదీ.. అయినా మనసు దాన్ని పోల్చలేకున్నదీ..
తానే వెతుకుతోందే దొరికినట్టే ఉన్నదీ.. అయినా చేయి చాచి అందుకోకున్నదీ..
రమ్మంటున్నా.. పొమ్మంటున్నా... వస్తూ ఉన్నా... వచ్చేస్తున్నా..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..

గుండెలో.. ఇదేమిటో.. కొండంత ఈ భారం
ఉండనీదు.. ఊరికే.. ఏ చోట ఈ నిమిషం..
వింటున్నావా.... నా మౌనాన్నీ.. ఏమో ఏమో... చెబుతూ ఉందీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..

కరిగిపోతూ ఉన్నదీ ఇన్నాళ్ల ఈ దూరం.. కదలిపోనూ అన్నదీ కలలాంటి ఈ సత్యం..
నా లోకంలో.. నాలోకంలో అన్నీ ఉన్నా..
ఏదో లోపం.. నువ్వేనేమో..
ఆపై దూరం.. ఏం లేకున్నా.. సందేహంలో.. ఉన్నానేమో!
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..

తనలో ఉన్నదేదో.. ఎదురుగానే ఉన్నదీ.. అయినా మనసు దాన్ని పోల్చలేకున్నదీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..

సినిమా: ఫిదా    సంగీతం: శశికాంత్ కార్తీక్

పాడినవారు: అరవింద్ శ్రీనివాస్, రేణుక

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

No comments:

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...