ఆనందానికీ, జీవిత కాలానికీ నేరుగా సంబంధం లేకపోయినా జీవితం సాఫీగా సాగడానికి మాత్రం ఆనందం తప్పనిసరి. మరి ఇదెక్కడ దొరుకుతుంది?
మనిషి
జీవితం నూరేళ్ళు.
కానీ
నిజమైన సంతోషంతో జీవించే
సమయం మాత్రం చాలా తక్కువ.
ఎవరినైనా
సరే..
మీరు
రోజంతా చాలా సంతోషంగా గడిపిన
సందర్భం గురించి చెప్పమంటే
తప్పకుండా ఆలోచించి తీరుతారు.
ఎందుకంటే
అలా చెప్పడం దాదాపు కష్టం.
కానీ
అలా జీవించగలగడం అసాధ్యం
మాత్రం కాదు.
మనిషికి
నిజమైన స్నేహితులు ఎవరైనా
ఉన్నారంటే అది ప్రకృతే.
ఉదయం
నుంచి రాత్రి నిద్రపోయేంత
వరకూ మనిషికి అవసరమైన
ఆనందాలన్నింటినీ రుచి
చూపిస్తుంది.
ప్రేమను
అందిస్తుంది.
వెతికే
మనసుండాలే కానీ ఆనందం మన
చుట్టూనే తిరుగుతుంటుంది.
మనమే
దాన్ని పట్టించుకోం.
నిజానికి
మనిషి అల్పసంతోషి.
చిన్న
చిన్న విషయాలకే సంబరపడిపోతాడు.
కానీ
సమస్యేంటంటే..
ఆనందం
ఎక్కడ దొరుకుతుందో సరిగా
గుర్తించలేకపోవడం.
కానీ
ఒకసారి చుట్టూ పరికించి చూస్తే
చాలు..
మన
చుట్టూ అల్లుకుని ఆనందం
స్వాగతిస్తుంది.
సహజ సౌందర్యంతో...
ఉదయాన్నే
హాయిగా తాకే చల్లగాలి..
దానికి
లయగా పలకరిస్తున్నట్లు తలలూపే
చెట్లు..
పక్షుల
కిలకిలారాగాలు తోడై అందించే
ఆహ్లాదం ఏ కవి వర్ణనకు అందుతుంది?
అనుభవించే
మనసుకు తప్ప!
ఏ
స్నేహితులూ అందించలేని హాయి
అది.
ఏ
వాద్యానికీ సాటిరాని సంగీతమది.
ఆ
చల్లగాలిని గుండెల నిండా
నింపుకుంటూ..
పక్షుల
కువకువల సంగీతాన్ని ఆస్వాదిస్తూ..
మంచుబిందువులను
శిరసున అలంకరించిన పచ్చిక
మీద నడుస్తుంటే..
అవేమో
అరికాలికి చక్కిలిగింతలు
పెడుతూ ఉల్లాసాన్నందిస్తుంటే..
ఆ
అనుభూతి స్వర్గపుటంచుల్లో
విహరిస్తున్నట్టుండదూ?
ప్రకృతిలో
ఎన్నో రంగులు.
ఒక్కో
రంగుకు ఒక్కో ధర్మమున్నా..
అవి
మనిషితో విడదీయని బంధంగా
పెనవేసుకున్నాయి.
ప్రతి
రంగూ ఒక ఆశ్చర్యమే!
ఉదయాన్నే..
కొండల
మధ్యనుంచి నక్కి బయటికి వస్తూ
లోకమంతా వెలుగును ప్రసరించే
సూర్యుడు రంగులన్నీ తన సొంతం
చేసుకున్నట్టు కనిపిస్తాడు.
లేత
పసుపు,
నారింజ
వర్ణాన్ని కలిపి పోత పోసినట్టుండే
సూర్యుని లేతకిరణాలు చక్కని
ఉదయానికి స్వాగతం పలుకుతున్నట్టూ..
వెచ్చని
తమ స్పర్శతో ముద్దాడుతున్నట్టూ
ఉంటుంది.
ఇలా
రోజంతా సూర్యుడు తన ప్రయాణాన్ని
కొనసాగిస్తూనే అనేక రంగులతో
కనువిందు చేస్తాడు.
అప్పుడే
చిగురులు వేస్తున్న మొక్క,
పండిపోయి
రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న
ఆకు..
హరివిల్లు,
నీలాకాశం..
మన
చుట్టూనే ఎన్నో రంగుల ప్రపంచాన్ని
అల్లాయి.
ప్రకృతిలో
గమ్మత్తైన వాటిల్లో పూలది
ప్రత్యేక స్థానం.
ఎప్పుడూ
చిరునవ్వులు చిందిస్తూ..
చూసేవారి
మనసుకు ప్రశాంతతను ప్రసాదిస్తాయి.
అవి
పంచే సువాసనలు ఎంతటి చిరాకులో
ఉన్నవారికైనా హాయినిస్తాయి.
వీటిని
మనస్ఫూర్తిగా పట్టించుకుంటే
సరి!
చిరునవ్వు వెల ఎంత?
కర్కశపు
మనసునైనా వెన్నలా కరిగించగల
శక్తి చిన్నపిల్లల బోసి
నవ్వుకే ఉంది.
కల్మషం
లేని వారి చిరునవ్వు చూడగానే
ఎవరికైనా మనసంతా హాయితో
నిండిపోతుంది.
చిరాకుగా
ఉన్నపుడు వారినలా చూస్తూ
గడిపితే మనసులో ఉండే ఏ ఆందోళనైనా
చేత్తో తీసేసినట్టు చెరిగిపోతుంది.
అసలు
చిరునవ్వుకున్న శక్తే అది!
ఈ
హడావుడి ప్రపంచంలో ప్రతి
ఒక్కరినీ పలకరించడం దాదాపు
కష్టం.
ఆత్మీయులు,
దూరంగా
ఉండే వాళ్లంటే సరే,
కానీ
కనీసం పక్కన ఉన్నవాళ్లనైనా
పలకరించాలంటే..
వారితో
బంధం ఎల్లప్పుడూ కొనసాగేలా
చూడాలంటే..?
చెరగని
చిరునవ్వే మార్గం.
పిల్లల
బాల్యమంతా తమ భవిష్యత్తును
నిర్మించుకోవడంలో సాగిపోతుంటే..
పెద్దలు
వారికి అన్నీ సమకూర్చడంలో
మునిగిపోతున్నారు.
ఫలితంగా
ప్రేమలు తగ్గుతాయి.
చిన్నప్పటి
నుంచే వారికోసమంటూ కొంత సమయం
కేటాయిస్తూ..
మాట్లాడుకోవడం
చేస్తుంటే..
అదే
అలవాటుగా మారి వారు పెద్దయ్యాక
కూడా కొనసాగుతుంది.
ప్రేమ
పదిలంగా ఉంటుంది.
ఏ
స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరూ
కోరుకునేది చిన్న ప్రశంస.
ద్వేషాన్ని
సైతం ప్రేమగా,
అసాధ్యాన్ని
సాధ్యంగా మార్చగల శక్తి చిన్న
మెచ్చుకోలుకు ఉంది.
ఇది
కోపాన్నైనా స్నేహంగా మార్చగలదు.
ఇది
కొండనైనా పిండిచేయగలమన్న
ధైర్యాన్నీ,
ఏదైనా
సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్నీ
ఇస్తుంది.
వీటిని
తెలుసుకుని ఆచరిస్తే మేలు!
ప్రేమను ప్రకటిస్తే ...
ఎవరికైనా
ప్రేమ అపురూపమే!
ప్రేమంటే
ఇదని చెప్పే సరైన మాటను
వర్ణించడం కష్టం.
దాన్ని
చరిత్రలో చదవలేం..
కవిత్వాల్లోనూ
పలికించలేము.
అలాంటి
భావాన్ని గుండెల్లోనే దాచుకుంటే
ఆత్మీయులపై మన అనురాగాన్ని
ఎలా తెలియజేయగలం?
వెతకాలే
కానీ ఎన్ని మార్గాల్లేవు!
వారంలో
కొంతసేపు కుటుంబానికి
కేటాయించండి.
జీవితభాగస్వామితో,
పిల్లలతో,
తల్లిదండ్రులతో
సరదాగా గడపండి.
వారితో
అలా దూరప్రాంతాలకు విహారానికి
వెళ్లిరండి.
మానసికోల్లాసంతోపాటు..
కుటుంబానికి
మీరిచ్చే ప్రాధాన్యమూ
తెలుస్తుంది.
ఒత్తిడి
నుంచి ఉపశమనం కూడా!
ఏ
ఆదివారమో..
సెలవు
దినం రోజో గంట కేటాయించి
బంధువులు,
స్నేహితులతో
ఫోన్లో మాట్లాడండి.
వారి
యోగక్షేమాలు కనుక్కోండి.
వారితో
గడిపిన కాలాన్ని గుర్తుచేయండి.
మనసు
గాల్లో తేలుతుంది.
ఇంత
చిన్న సంభాషణలో ఎంత ఆనందం
దాగుందో అర్థమవుతుంది.
ఎంత
ఆస్వాదించామో..
అంతా
పంచినట్టవుతుంది.
పైగా
బంధం కూడా బలపడుతుంది.
మీ
ఆత్మీయుల,
స్నేహితుల
ప్రత్యేకమైన రోజును గుర్తుండిపోయేలా
చేయండి.
బజారులో
దొరికే వస్తువులపై ఆధారపడకుండా..
కిందటేడాది
వారు ఈ రోజును ఎలా జరుపుకున్నారో
గుర్తు చేస్తూ ఒక ఉత్తరం
రాయండి.
వారి
కోసం ప్రత్యేకంగా మీరే ఏదైనా
తయారు చేసి ఇవ్వండి.
ఏదీ
కుదరదనుకుంటే..
ఒక
రంగు కాగితాన్ని తీసుకుని
మీ చేతిరాతతో అభినందనలు రాసి
అందించండి.
ఏదైనా
సరే..
సొంతంగా
చేయండి.
మీ
ద్వారా పొందిన ఆనందాన్ని
బహుశా వారు కూడా వర్ణించలేరేమో!
ఎంత
అందిస్తే అంతా వెనక్కు వచ్చేది
ప్రేమొక్కటే.
అందుకు
చక్కని ఉదాహరణ జంతువులూ..
పక్షులూ.
నగరమైనా..
పల్లెటూరైనా..
పక్షులు
కనిపించని చోటుండదు.
అవి
కనిపించగానే వాటికి కొన్ని
గింజలు చల్లండి.
వాటికోసం
ప్రత్యేకంగా చిన్న గిన్నెల్లో
నీరు ఉంచండి.
తీరికగా
ఉన్నపుడు ప్రయత్నించి చూస్తే..
అది
అందించే తృప్తి..
అనుభవించడమే..
వర్ణించడం
కష్టం.
కొద్దిగా
ఆలోచిస్తే..
ఆనందం
అరచేతిలోనే!
క్షమ, సాయం...

ఆపదలో
ఉన్నవారికి చేతనైన సాయం చేయడం,
అవసరానికి
ఆదుకోవడంలో ఉన్నంత తృప్తి
ఏ సిరి సంపదలు ఇవ్వగలవు?
అవసరమంటూ
ఎవరు అడిగినా..
మీకు
చేతనైనంత సాయం చేయండి.
కుదరకపోతే..
సాయం
పొందగల దారినైనా చూపించండి.
ఇలా
నా అన్నవాళ్లు అన్నవారిని
నలుగురిని సంపాదించుకుంటేనే
కదా జీవితానికి అసలైన అర్థమూ..
పరమార్థమూనూ..!
మనసు
పెడితే సరి!
మనకోసం మనం...
మన
చేత్తో ఒక విత్తనాన్ని నాటి,
అది
మొలకెత్తడం కోసం చూసే ఎదురుచూపులో
ఎంతో ఆనందముంటుంది.
భూమిని
చీల్చుకుంటూ మొలక బయటికి
వచ్చి..
తరువాత
చిన్న చిన్న చిగుళ్లు వేస్తుంటే..
దాన్ని
చూసి మురిసిపోని మనసుంటుందా!
చిన్నపిల్లలను
సాకినట్లు దానిని నిరంతరం
రక్షించడంలో ఉండే సంతృప్తి
మాటల్లో వర్ణించలేనిది.
పుస్తకం
మంచి నేస్తం.
ఒక్కసారి
పరిచయం చేసుకోవాలిగానీ..
ఎన్నో
విషయాలను తెలియజేస్తుంది.
ఎన్నో
సంస్కృతులను పరిచయం చేస్తుంది.
ఒక
పుస్తకం చదవడం ద్వారా ఎన్నో
మంచి విషయాలను తెలుసుకోవడంతోపాటు..
మనసుకు
ప్రశాంతత చేకూరుతుంది.
భాషపై
పట్టు సాధించడానికీ తోడ్పడుతుంది.
‘హృదయానికి
చెవులుంటే జగమంతా నాదమయం-
కనగలిగిన
మనసుంటే బ్రతుకే అనురాగమయం’
అనే పాట వినేవుంటారు.
ఎంతటి
మొరటువారినైనా కదిలించగల
శక్తి సంగీతానికికుంది.
పాట
వింటూ తాళమేయకుండా ఉండేవారు
బహుకొద్దిమంది.
ఒంటరిగా
ఉన్నపుడో..
చిరాకుగా
ఉన్నపుడో ఒక మంచి పాట వినండి.
దానితోపాటు
మీరూ శ్రుతి కలపండి.
కుదిరితే
లయకు తగ్గట్టుగా చిందేయండి.
మీ
ఒంటరితనం..
చిరాకు
అలా అల్లంత దూరాన పారిపోవడం
మీరే చూడొచ్చు.
పున్నమి
వెన్నెలను చూస్తే..
ఎవరికైనా
కవిత్వం పొంగుకు రావడం ఖాయం.
ఆరుబయట..
పండు
వెన్నెల్లో కూర్చుని స్నేహితులు,
కుటుంబ
సభ్యులతో కలిసి ఆటలాడుకుంటూ..
ముచ్చట్లు
చెప్పకుంటూ గడిపితే ఆ ఆనందం
రుచి అనుభవించే వారికే
తెలుస్తుంది.
తెలిసిన
అంశాలే...
పాటిస్తే
సరి!
మంచి
పంట చేతికందాలంటే..
పదునైన
నాగలి పోటుకు నేల తలవంచాల్సిందే.
అందమైన
స్వర్ణాభరణం తయారవాలంటే..
కొలిమి
వేడికి తట్టుకోవాల్సిందే.
ఇనుము
అందమైన వస్తువుగా వంగాలంటే..
సమ్మెట
పోట్లను ఆహ్వానించాల్సిందే.
అలాగే
జీవిత నిర్మాణం అందంగా
సాగాలంటే..
ఎన్నో
ఆటుపోట్లను ఎదుర్కోవాల్సిందే.
జీవితంలో
పైకి రావాలని అందరూ కోరుకుంటారు..
ఆశిస్తారు.
తప్పులేదు.
దానికి
కృషి కూడా అవసరమే.
కానీ
దానికి ఆనందాన్ని పణంగా
పెట్టాల్సిన పనిలేదు.
ఆనందం
మనలోనే ఉంటుంది.
అనుభవించే
మనసులో ఉంటుంది.
మన
చుట్టూ ఉంటుంది.
సరిగా
గమనిస్తే..
మనతోనే
ఎల్లప్పుడూ ఉంటుంది.
కృషికి
ఆనందం తోడైతేనే కదా..
నిజమైన
విజయం..
సంతృప్తి!
పువ్వు..
గడ్డిపోచ..
చిగురాకు..
పంటమొక్క...
వీటి
జీవితకాలాలు తక్కువే.
కానీ
జీవితాన్ని ఎలా ఆనందంగా
గడపొచ్చో చెబుతాయి.
తృప్తిగా
ఎలా జీవించాలో కూడా నేర్పిస్తాయి.
వీటిని
ఆదర్శంగా తీసుకుంటే నిజమైన
జీవితాన్ని ఎలా అర్థం
చేసుకోవచ్చో..
అనుభవించవచ్చో
తెలుసుకోవచ్చు.