Tuesday, 28 November 2017
Sunday, 8 October 2017
Friday, 29 September 2017
సింహాసనా.. శత్రు శాసనా..
కొన్ని పాటలు సాహిత్యంతోనూ, కొన్ని చిత్రీకరణ కారణంగా.. ఇంకొన్ని మ్యూజిక్ కారణంగా నచ్చుతాయి. ఈ పాట ఏ కోవకు చెందుతుందో పూర్తిగా నాకే తెలియలేదు. కానీ బాగా నచ్చింది. వింటుంటేనే ఒళ్లంతా గగుర్పొడుస్తుంది.. ఎన్నిసార్లు విన్నా అదే అనూభూతి కొనసాగుతోంది. అందుకే ఇలా పంచుకుంటున్నా.
అసుర రావణాసుర... అసుర అసుర రావణాసుర...
విశ్వ విశ్వ నాయక... రాజ్య రాజ్య పాలక...
వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక...
శక్తి శక్తి సూచిక... యుక్తి యుక్తి పాచిక...
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక...
ఓ.. ఏక వీరా.. శూరా.. క్రూరా.. కుమారా...
నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వరా...
హో.. రక్త ధారా.. చోరా.. ఘోరా.. అఘోరా...
కర్కశంగ రేగుతున్న కాల కింకరా...
రావణా... జై జై జై
శత్రు శాసనా... జై జై జై
రావణా... జై జై జై
సింహాసనా... జై జై జై
అసుర అసుర అసుర అసుర రావణాసురా...
అసుర అసుర అసుర అసుర రావణాసురా...
చిత్ర చిత్ర హింసక.. మృత్యు మృత్యు ఘంటిక...
మృత్యుకాల ఏక కాల పలు రకాల ధ్వంసక...
ఖడ్గ భూమి ధార్మిక కదనరంగ కర్షక...
రావణగర పట్టణాల సకల జనాకర్షక...
ఓ.. అంధకారా.. తార.. ధీర.. సుధీర...
అందమైన రూపమున్న అతి భయంకర...
ఓ.. ధుర్వితార.. భైర.. స్వైర.. విహార...
పాపాలాగ నవ్వుతున్న ప్రళయ భీకరా...
రావణా... జై జై జై
శత్రు శాసనా... జై జై జై
రావణా.... జై జై జై
సింహాసనా.... జై జై జై
నవరసాల పోషక.. నామరూప దాషక...
వికృతాల విద్యలెన్నో చదివినా వినాశక...
చరమగీత గాయక... నరకలోక నర్తక...
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచకా...
హో... అహంకార.. హర.. భార.. కిషోర...
నరాలు నాగు పాములైన నిర్భయేశ్వరా...
హో... తిరస్కార.. ధీర.. ఏర.. కుభీర...
కణము కణము రణములైన కపాలేశ్వరా...
రావణా... జై జై జై
శత్రు శాసనా.... జై జై జై
రావణా... జై జై జై
సింహాసనా.... జై జై జై
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
Friday, 22 September 2017
రావణా.. జై జై జై (జై లవ కుశ రివ్యూ)
జై
లవ కుశ.. అని
పేరును ప్రకటించడం,
అందునా
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం
అని ప్రకటించడంతోనే సినిమాపై
అందరిలోనూ ఆసక్తి మొదలైంది.
జై పాత్ర
పోస్టర్ ఆ ఆసక్తిని మరింత
పెంచింది.
ఆ తరువాత
విడుదలైన పోస్టర్లు,
టీజర్లు
సినిమాపై మరింత కుతూహలాన్ని
పెంచాయి.
కానీ దీనిలో
ఎక్కువ క్రెడిట్ జై పాత్రకు
దక్కుతుందనే చెప్పాలి.
ఈ పాత్రతోనే
అటు ప్రేక్షకులతోపాటు మొత్తం
సినిమా పరిశ్రమ దృష్టినీ
ఆకర్షించారు ఎన్టీఆర్.
వీటికితోడు
టీజర్లు,
ట్రైలర్
బద్దలుకొట్టిన రికార్డులు
సరేసరి!
ఇన్ని అంచనాల
మధ్య జై,
లవ,
కుశ
ఆకట్టుకున్నారా?
కథ,
పాత్రల స్వభావం
గురించి నిర్మాత కళ్యాణ్
రామ్, దర్శకుడు
బాబీ తమ టీజర్ ద్వారానే
వివరించారు. ఎన్టీఆర్
కూడా ఇది ఓ అన్నదమ్ముల కథ అనీ,
వారి అనుబంధమే
సినిమా అనీ ఒక రకంగా కథేమిటో
ముందే చెప్పేశారు.
మరి ఇక
చూడాల్సిందేమిటంటే..
ఇద్దరు
రామలక్ష్మణులైనప్పుడు ఒకడు
రావణుడు ఎందుకయ్యాడనీ,
మూడు పాత్రల్లో
ఎన్టీఆర్ ఎంతవరకూ మెప్పించగలిగాడనీ.
లవ
పాత్రలోని అమాయకత్వాన్నీ,
నిజాయతీనీ..
కుశగా తుంటరితనాన్నీ
ఎన్టీఆర్ మిగతా సినిమాల్లోని
ఏదో పాత్రల్లోలా భావించినా..
జై పాత్ర
పూర్తిగా విలనిజంతో కూడుకున్నది.
సాధారణంగా
హీరోని నెగెటివ్ పాత్రలో
చూడటానికి ప్రేక్షకులు
ఇష్టపడరు.. ముఖ్యంగా
మన తెలుగు ప్రజలు.
పైగా ఈ పాత్రకు
నత్తి కూడా ఉంది.
ఎన్టీఆర్
అంటేనే గుర్తొచ్చేది..
అనర్గళంగా
తను చెప్పే డైలాగులు.
ఈ విషయాలన్నీ
దృష్టిలో ఉంచుకుని కూడా జై
లాంటి పాత్రను ఎంచుకోవడం
ధైర్యం, కథపై
వారికున్న నమ్మకమనే చెప్పవచ్చు.
ముందుగా
కథ విషయానికొస్తే..
పిల్లల మధ్య
చూపించే భేదభావాలు వారిపై
ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేదే
కథాంశం. దానికి
బలైనవాడే.. జై
అలియాస్ రావణ్.
ఎన్టీఆర్
ద్విపాత్రాభినయం ఇంతకు ముందు
చూసిందే. అదుర్స్
లో చారి పాత్రలో నవ్వులు
పూయించారు. కానీ,
తనలోని నటనకు
నిజమైన పరీక్ష జై పాత్రనే.
సినిమా ప్రీ
రిలీజ్ ఫంక్షన్ లో సుకుమార్
మాట్లాడుతూ.. మేమంతా
ఎన్టీఆర్ అనే నట మహాసముద్రం
నుంచి స్పూన్లకొద్దీ నీళ్లనే
వాడుకున్నాం. కానీ
బాబీ ట్యాంకర్ల కొద్దీ
వాడుకున్నాడని అనడం అతిశయోక్తి
కాదనిపిస్తుంది.
అంతలా ఆ పాత్రలో
ఒదిగిపోయారు ఆయన.
ప్రీ
క్లైమాక్స్ లో వచ్చే సీన్లో
రావణుడిని పొగుడుతున్నపుడు
అతని కళ్లలోని గర్వం,
వెంటనే అలాంటి
గంభీరమైన మొహంలో మొదలైన
మార్పును ఏకకాలంలో చూపించగలగడం
ఎన్టీఆర్ కే సాధ్యమనిపిస్తుంది.
మూడు పాత్రలూ
ఒకే గెటప్ లో ఉన్నపుడూ వైవిధ్యం
స్పష్టంగా కనిపిస్తుంది.
అసలు ఒక్కరే
మూడు చేశారంటే నమ్మాలనిపించదు.
డ్యాన్సుల్లోనూ
ఈ వైవిధ్యం స్పష్టంగా
కనిపిస్తుంది.
ఇందుకు చోటా
కె నాయుడు సినిమాటోగ్రఫీ
కూడా బాగా తోడ్పడింది.
దర్శకుడు
బాబీ జై పాత్రలోని రౌద్రాన్నీ,
క్రూరత్వాన్నీ,
అతను అలా
మారడానికి గల కారణాలను చాలా
కన్విన్సింగ్ గా చెప్పగలిగారు.
ఒకవైపు భయపెడుతూనే
మరోవైపు జాలిని కూడా కొనసాగిస్తాడు.
ప్రీ క్లైమక్స్,
క్లైమాక్స్
ల్లో కంటతడినీ పెట్టిస్తాడు.
మొదటి భాగంలో
కుశ పాత్రతో ఎంతగా నవ్విస్తాడో..
రెండో భాగంలో
జై పాత్రతో అంతగా ఏడిపిస్తాడు.
ఎలాంటివారికైనా
ఆ సీన్లలో కన్ను చెమ్మగిల్లుతుంది.
రెండో
భాగంలో.. కొన్ని
సీన్లలో కథకు బలం చేకూరుస్తూ
దేవీశ్రీ ప్రసాద్ అందించిన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఆకట్టుకుంటుంది..
ముఖ్యంగా
అన్నదమ్ముల మధ్య వచ్చిన
సీన్లలో. ఒకరకంగా
సినిమాకే ప్రాణమని చెప్పాలి.
హీరోయిన్లు-
రాశి ఖన్నా,
నివేథా థామస్,
మిగిలిన పాత్రలు
వాళ్ల వాళ్ల పరిధి మేరకు
నటించారు. స్పెషల్
సాంగ్ లో తమన్నా బాగా చేసింది..
అదీ జై పాత్ర
వచ్చాక కళ్లన్నీ మళ్లీ అతని
మీదకే వెళ్లిపోతాయి.
ఏదైనా
సినిమా గురించి మాట్లాడాలంటే..
కథ,
హీరో,
కామెడీ,
విలన్ గురించి
మాట్లాడుకుంటాం.
కానీ జై లవ
కుశ గురించి మాట్లాడాలంటే
మాత్రం ఒక్క ఎన్టీఆర్ గురించే
మాట్లాడాల్సి వస్తుంది.
చివరగా..
ఘట్టమేదైనా..
పాత్ర ఏదైనా
ఎన్టీఆర్ కే సాధ్యం అనేలా
ఒప్పించాడు.
అందుకే..
ఎన్..టీ..
ఆర్..
జై జై జై
అనక తప్పదు.
- నీరుకొండ
అనూష
Friday, 11 August 2017
ఏదో జరుగుతోంది.. (ఫిదా)
ఈ మధ్య కాలంలో నాకు చాలాసార్లు వినాలనిపించీ, ఎన్నిసార్లు విన్నా.. విసుగనింపించని పాట ఇది. ఈ పాట ఫిదా సినిమాలోది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించిన సాహిత్యానికి, సంగీత దర్శకుడి నేపథ్య సంగీతం చక్కగా తోడైంది.. అందుకే ఆ సాహిత్యాన్ని ఇక్కడ అందించాలనిపించింది.
తనలో ఉన్నదేదో.. ఎదురుగానే ఉన్నదీ.. అయినా మనసు దాన్ని పోల్చలేకున్నదీ..
తానే వెతుకుతోందే దొరికినట్టే ఉన్నదీ.. అయినా చేయి చాచి అందుకోకున్నదీ..
రమ్మంటున్నా.. పొమ్మంటున్నా... వస్తూ ఉన్నా... వచ్చేస్తున్నా..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
గుండెలో.. ఇదేమిటో.. కొండంత ఈ భారం
ఉండనీదు.. ఊరికే.. ఏ చోట ఈ నిమిషం..
వింటున్నావా.... నా మౌనాన్నీ.. ఏమో ఏమో... చెబుతూ ఉందీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
కరిగిపోతూ ఉన్నదీ ఇన్నాళ్ల ఈ దూరం.. కదలిపోనూ అన్నదీ కలలాంటి ఈ సత్యం..
నా లోకంలో.. నాలోకంలో అన్నీ ఉన్నా..
ఏదో లోపం.. నువ్వేనేమో..
ఆపై దూరం.. ఏం లేకున్నా.. సందేహంలో.. ఉన్నానేమో!
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
తనలో ఉన్నదేదో.. ఎదురుగానే ఉన్నదీ.. అయినా మనసు దాన్ని పోల్చలేకున్నదీ..
ఏదో జరుగుతోంది.. ఎదలో అలజడీ..
ఏదో అడుగుతోంది.. ఎదరే నిలబడీ..
సినిమా: ఫిదా సంగీతం: శశికాంత్ కార్తీక్
పాడినవారు: అరవింద్ శ్రీనివాస్, రేణుక
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
Sunday, 23 July 2017
టీజర్ ఫిదా చేసింది...
డైరెక్టర్, హీరో, హీరోయిన్.. సాధారణంగా సినిమా చూడటానికి చాలావరకు ఇవే ప్రధాన కారణాలు అవుతాయి. కానీ నాకు ఒక డైలాగ్..
‘బాడ్ కవ్.. బొక్కలు ఇరగ్గొడతా..’
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఒక పాట..
‘ఊరుకోదు.. ఊసుపోదు.. ఉండనీదు.. వెళ్లనీదు.. వింత ఖైదు.. ఏమిటో నాకిలా..!’
సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
సినిమా అని కచ్చితంగా చెప్పలేను.. ఎందుకంటే నేను వినేటప్పటికి ఇవి ఏ సినిమాలోవో నాకు తెలియదు. కానీ ఇవి దేంట్లోవా అని తెలుసుకోవాలనే కుతూహలంతో గూగుల్ లో వెతికిన (మరీ ఎక్కువగా వెతకాల్సిన అవసరం రాలేదు.. సాయి పల్లవి డైలాగ్ కారణంగా) తర్వాత సినిమా పేరు ఫిదా కనిపించింది. అలా వెతికిన లింక్ తో ఫిదా టీజర్ చూశాను. 1, 2, 3, .... కనిపించినవన్నీ చూసేశాను. చాలా నచ్చాయి.
హీరోయిన్ గురించి నాకు పెద్దగా తెలియదు కానీ..ముకుంద సినిమానుంచే హీరో వరుణ్ తేజ్ నటన, ఆహార్యం, హావభావాలు నాకు చాలా నచ్చాయి. అంటే చాలా బాగా నటించేస్తాడు అని కాదు.. కానీ నచ్చేశాడంతే. ప్రత్యేకంగా కారణాలు చెప్పాలంటే .. కొంచెం కష్టమే. ఈ రెండు ప్రధాన కారణాలు వెరసి, నన్ను థియేటర్ వైపు నడిపించాయి.
ఇక సినిమాలోకి వస్తే.. ముందుగా కథ గురించి చెప్పాలంటే.. ఒక స్టోరీ ఉంది అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే.. ఇది మొత్తం పాత్రలు, వారి ఎమోషన్స్ అంతే. ఒక లైనులో చెప్పడం కష్టం.. చెబితే దాని అందాన్ని పోగొట్టినట్టే అవుతుందని నా భావన.
ఈ సినిమాలో ఇంకో ఆకర్షించే విషయం - హీరోయిన్ సాయి పల్లవి భానుమతి పాత్ర. సినిమా చూశాక ప్రధాన ఆకర్షణ కూడా ఈమే అవుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే.. సినిమాకి ప్రాణం. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఒక తమిళ అమ్మాయి.. తక్కువ సమయంలో తెలుగును అందునా.. తెలంగాణ యాసను ఒడిసిపట్టుకుని, ఏమాత్రం తప్పు దొర్లకుండా జాగ్రత్త పడటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఆమె నుంచి వచ్చిన తెలంగాణ మాండలికం పాత్రకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.
ఈమెది అల్లరిగా, చిలిపిగా కనిపించే ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర. పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూనే భావోద్వేగాల మధ్య నలిగిపోయే తీరు చాలా చక్కగా చూపించగలిగింది. ‘వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిందే..’, ‘ఏ పిల్లగాడా..’ పాటల్లో డాన్స్ కూడా చాలా బాగా చేసింది.
ఇక వరుణ్ తేజ్...వరుణ్ పాత్రకు తను మాత్రమే సరిపోతాడు అనేలా చేశాడు. ఎమోషన్స్ ను చాలా బాగా పలికించాడు. మామూలుగానే అతనిపై ఉన్న అభిమానం ఈ సినిమాతో మరింత పెరిగింది. అందరు హీరోలూ మాస్ చట్రంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే.. తను మాత్రం కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు నాకు అనిపించింది. మెగా ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్ తో వచ్చినా.. చేసింది తక్కువ సినిమాలే అయినా మిగతా వారితో పోలిస్తే భిన్నంగా చేసుకుంటూ వెళ్లడం బాగా నచ్చింది.
సినిమా మొత్తంలో ఉన్నది కొద్ది పాత్రలే అయినా.. అందరూ తమ తమ పరిధి మేరకు బాగా చేశారు. ఏ పాత్ర కూడా అనవసరంగా అనిపించదు. కామెడీ కోసం ప్రత్యేకంగా పాట్లు కనిపించవు. ఈ విషయంలో శేఖర్ కమ్ముల తీసుకున్న జాగ్రత్త కనిపిస్తుంది. అశ్లీలత లేకుండా హీరోయిన్ లను అందంగా మరెవరూ చూపించలేరేమో అనిపిస్తుంది ఈయన సినిమాలు చూస్తే. చాలా సాధారంగా చూపిస్తూనే.. ‘అరె.. హీరోయిన్ భలే అందంగా ఉందే..’ అనిపించేలా చూపిస్తాడు. చుట్టూ పరిసరాలను చాలా సహజంగా చూపించడంలోనూ తనదైన ముద్ర కనబరుస్తారు. ఈ సినిమాలోనూ తనదైన ముద్ర కనపడుతుంది.
సాధారణంగా సినిమాల్లో.. పల్లెటూరి వాతావరణం అనగానే కోనసీమ అందాలు, గోదావరి హొయలనే చూపిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ పల్లెటూర్లూ.. అందులోని అందాలు, సంప్రదాయాలను ఉన్నది ఉన్నట్లుగా చాలా చక్కగా పరిచయం చేశారు.
‘జ్ఞానం ఇస్తున్నవ్ కదా.. పుక్కిట్ల మేమేం తీస్కోం’
‘ప్రేమ పుట్టకముందే సచ్చిపోయింది.. ఇంక నాకు సాకులు అవసరం లేదు’
‘ఒకరితో జీవితాంతం ఉండాలనుకుంటాం కదా.. తనే ఆ అమ్మాయి’
లాంటి చాలా సంభాషణలు ఆకట్టుకుంటాయి. కానీ ప్రత్యేకంగా, డైలాగ్ పెట్టాలి కాబట్టి రాశారు అనేలా ఉండవు. మరోసారి శేఖర్ కమ్ముల కలంలో నుంచి చాలా మంచి సంభాషణలు వచ్చాయి.ఇందుకు విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ చాలా తోడ్పడింది. రెండు భిన్న ప్రపంచాల తీరు, వాటి అందాలను బంధించడంలో ఆయన పాత్ర చాలా స్పష్టం. కళ్లకు హాయిగొలిపే ఆ అందాలకు జీవన్ బాబు అందించిన నేపథ్య సంగీతం శ్రవణానందాన్ని కలిగిస్తుంది.
ఇక నేను ముందే చెప్పినట్టు.. పాటలది కూడా ప్రధాన పాత్రే. పాటలన్నీ ప్రత్యేకంగా అతికించినట్టుగా కాకుండా కథలో భాగంగా సాగిపోతాయి. నృత్యాల కోసమే తీసినట్టుగా ఉండవు.. అసలలా లేవు కూడా. ఈ సినిమాకి సంగీతం అందించింది.. శక్తికాంత్. పాటలన్నీ హాయిగా.. ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. సినిమాలో భాగంగా చూసినప్పుడు మరింత ఆకట్టుకుంటాయి. మొత్తంగా కథతోపాటు, పాటలు కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా కొంతసేపు అలా మనసులో విహరిస్తూ ఉంటాయి.
అయితే ప్రథమార్థం చాలా ఆకట్టుకుంటుంది. చాలా చిలిపిగా, అల్లరిగా సాగిపోతుంది కాబట్టి. కానీ ద్వితీయార్థం చివర్లో ఏదో కాస్త వెలితి (హీరో ఇండియాకి వచ్చేయడం, హీరోయిన్ పెళ్లికి ఒప్పుకోవడంలో కొంత లాజిక్ మిస్ అవుతుంది) కనిపించినా.. మొత్తంగా అదో పెద్ద విషయం కాదు అనిపించడం ఖాయం.
ఉత్కంఠలేమీ లేకుండా.. గొడవలు, రక్తపాతాల జోలికి పోకుండా.. పంచ్ డైలాగ్ లు, ప్రాసలు లేకుండా.. అందమైన పల్లెటూరు, కుటుంబ ప్రేమలు, ఒక మంచి ప్రేమకథ, ఇద్దరి జీవితాలు, వినసొంపైన పాటలు.. సినిమా పూర్తయ్యేటప్పటికి ప్రశాంతమైన మనసుతో, హాయిగొలిపే భావనతో బయటికి రావాలనుకునేవారు ఎంచుకోదగ్గ సినిమా ఇది.
మొత్తంగా నా వరకైతే టీజర్ ఫిదా చేసింది.. సినిమా దాన్ని కొనసాగించింది.
Wednesday, 19 July 2017
ఆమె..
చిన్నికళ్లు.. కొంచెం బొద్దుగా.. నిండైన చిరునవ్వుతో ఉండే తనను చూడగానే నా మనసు చేజారిపోయింది. చిన్న చిన్న విషయాలను కూడా అపురూపంగా చూస్తూ.. ఆశ్చర్యానికి గురయ్యే ఆ కళ్లు.. వాటిలోని మెరుపులను చూడటానికి నా మనసు తహతహలాడుతుండేది.
ఓరోజు కారు మొరాయించడం,
క్యాబ్
కోసం ప్రయత్నిస్తున్నపుడు
వర్షం కారణంగా నిలిచిన
నీటిగుంటలో ఫోను పడటం వెరసి..
తప్పక
అడుగులు బస్టాండ్ వైపుకు
పడ్డాయి.
ఎంతో
అసహనంతో,
చిరాకుగా
ఉన్న నాకు తారసపడిందామె.
రోడ్డుమీద
చిన్న కొలనులా నిలిచిన నీటిలో
అడుగుపడకుండా,
పక్కగా
ఉన్న కొద్ది స్థలంలో అడుగులో
అడుగు వేసుకుంటూ,
అప్పుడప్పుడూ
గెంతుతూ వస్తోంది.
కానీ,
పక్కగా
వచ్చిన బండి వేగంగా వెళ్లడంతో
నీళ్లు చింది ఆమెపై పడ్డాయి.
ఎవరికైనా
కోపం వస్తుంది.
కానీ
ఆమెలో అదేం లేదు.
పైగా
ఆపిన బండి అతన్ని చూసి ఫర్వాలేదంటూ
వెళ్లమంది.
అతనిలో
కృతజ్ఞతతో కూడిన చిరునవ్వు.
మరి
ఆమెలో..
అర్థం
కాలేదు.
ఆ
చర్యే ఆమెను నేను మళ్లీ మళ్లీ
చూసేలా ప్రేరేపించింది.
ప్రతీ
చిన్నవిషయానికీ ఆశ్చర్యంగా
చూసే చూపు,
లోకంలోని
సంతోషమంతా తనకే సొంతమన్నంత
ప్రశాంతత నన్ను అమితంగా
ఆకర్షించాయి.
అప్పటిదాకా
నాలో దాగిఉన్న చిరాకు,
మీటింగ్
కు సమయం మించిపోతోందన్న
ఆందోళనను దూరం చేశాయి.
బస్సు
వస్తోంటే భయమనిపించింది..
ఆమె
దూరమవుతుందేమోనని.
అది
వెళ్లిపోయింది కానీ ఆమె ఉంది.
నాలో
సంతోషం.
ఇలా
బస్సు వస్తున్న ప్రతీసారి
అదే తంతు.
ఈసారి
మాత్రం ఆమె ఎక్కే బస్సే..
ఎక్కడానికి
ఆమె సన్నద్ధమవుతున్న తీరే
ఆ విషయాన్ని నాకు తెలియజేసింది.
నాలో
నిరాశ బస్సు వైపు చూశాను.
నేను
ఎక్కాల్సిన బస్సే..
ఆనందంతో
ఆమె వైపు చూశాను.
నవ్వింది..
అరె..
నన్ను
చూసే నవ్వింది.
సందేహమొచ్చింది.
నిర్ధారించుకోవడానికి
మళ్లీ నవ్వాను.
అదే
నవ్వు.
నవ్వేసి
బస్సెక్కింది.
నేనూ
హడావుడిపడుతూ ఎక్కేశాను.
ఎక్కగానే
నేను చేసిన పని..
ఆమె
ఎక్కడ ఉందో వెతకడమే.
ఆ..
అదిగో
కనిపించింది.
డ్రైవర్
వెనకగా ఉన్న సీట్లో అందరికీ
ఎదురుగా ఉండే సీటులో కూర్చొనుంది
తను. నేను
మాత్రం నిల్చొనే ఉన్నాను.
మళ్లీ
నావేపు చూస్తుందేమనని ఆశగా
చూస్తున్నాను.
కానీ
ఆమె నావైపు చూడను కూడా చూడట్లేదు.
ఎందుకో
నాకర్థం కాలేదు.
అప్పుడే
ఎవరో ఒకావిడ బ్యాగు తగిలితే..
మళ్లీ
అదే నవ్వు.
ఎవరిని
చూసినా అదే నవ్వు.
ఈసారి
నా మనసు చివుక్కుమంది.
తను
నన్ను ప్రత్యేకంగా చూడలేదు..
అందరితోపాటే
నేనూ.
బాధనిపించింది.
కొంచెం
బాధగా ఆమె వైపు చూశాను.
చుట్టూ
ఎంతో మంది అమ్మాయిలు..
మోడ్రన్.
ఎప్పుడూ
పని విషయం మినహాయించి వారి
వైపు ఆసక్తిగా చూసిందే లేదు.
ఎంత
ఆలోచించినా నన్ను చూసి నవ్వలేదు
అని నేను బాధపడటానికి కారణమేంటో
తట్టలేదు.
నేను
నా ఆలోచనలో ఉంటే..
తను
మాత్రం పక్కనున్న పాపాయితో
ఆడుతోంది.
మళ్లీ
అదే అందమైన నవ్వు..
కళ్లలో
మెరుపు.
నేను
దిగాల్సిన గమ్యం వచ్చింది.
మరోసారి
ఆమెను చూసి దిగేశాను.
ఆరోజు
మొదలు ..
మొదట
చిరాగ్గా పడిన నా అడుగులు
ఆసక్తిగా బస్టాండ్ వైపుకు
సాగుతున్నాయి.
.ఆ
నవ్వు కోసం.
నాలో
ఏదో మార్పు..
అందరూ
అంటున్న మాట ఇది.
నాకూ
తెలియదు ఏం మార్పో!
ఒకటి
మాత్రం తెలుసు..
నేను
ఆనందంగా ఉన్నాను.
.ఇంటర్
లో స్టేట్ ర్యాంకు వచ్చినప్పటికన్నా..
క్యాంపస్
ప్లేస్ మెంట్స్ లో ఉద్యోగం
సంపాదించినప్పటికన్నా..
సొంతంగా
కంపెనీ పెట్టినప్పటికన్నా.
ఫలానా
భావన అని నాకు తెలీదు.
కానీ
నేర్చుకున్నా..
నవ్వడం,
నవ్వుతూ
పలకరించడం.
చెప్పాలనిపించింది
ఆమెకు ఈ విషయాలన్నీ..
చెబితే
ఏమనుకుంటుందో నని ఆగిపోయాను.
పోనీ
ప్రయత్నమైనా చేద్దామనుకున్నాను..
కానీ
ఏం చెప్పాలో అర్థం కాలేదు.
అందుకే
రాస్తున్నా ఆమె గురించి..
దాచుకోవాలనిపించి!
Sunday, 14 May 2017
థాంక్యూ... అమ్మా..
తనలోనే
ప్రతి సృష్టి
జరిపి,
ఒక
కొత్త జీవికి
ప్రాణం పోస్తుంది.
తన
రక్తాన్నే
పాలుగా మార్చి
పోషిస్తుంది.
గుండెల
మీద జోకొట్టి,
ఆ
రూపాన్ని
జీవితాంతం
ప్రేమిస్తుంది.
ఎండ
కన్నెరగకుండా
పెంచుతూనే,
లోకం
పోకడను పరిచయం
చేస్తుంది.
ప్రతి
మనిషీ
ఒక్కో
రకంగా
చెప్పే
నిర్వచనం-
అమ్మ.
భాషలు
వేరైనా
ఆమె
గురించిన
భావం
ఒకటే.
పదాలు
వేరైనా
అర్థం
ఒకటే!
ఒక్కో
తలపూ
ఒక్కోలా
వివరిస్తుందంతే.
ఎవరెన్ని
రకాలుగా
చెప్పినా,
ఎంత
వివరించినా
ఇంకా
మిగిలిపోయేది
అమ్మ
ప్రేమకు
నిర్వచనమే.
జీవితాన్ని
పాఠాలుగా
నేర్పి,
ప్రపంచం
ముందు విజేతగా
నిలుపుతుంది..
మరి
అలాంటి అమ్మకి
మనమేం ఇద్దాం?!
చెబుదామా
మనసారా ఒక
థాంక్స్?
ఇద్దామా
బహుమతిగా ఓ
కృతజ్ఙతని!
![]() |
అమ్మతో.. నే కన్న నా చిన్నతల్లి |
సృష్టికి
మూలం అమ్మ.
ప్రపంచం
ఎంతైనా మారిపోనీ..
మనుషులు
ఎక్కడిదాకా
అయినా ఎగిరిపోనీ..
ఎప్పటికీ
మారనిదీ..
మరెవ్వరికీ
సాటిరానిదీ
అమ్మ ప్రేమే.
ఆకలేసినా..
దాహమేసినా..
కోపమొచ్చినా..
కష్టమొచ్చినా..
చివరికి
దెబ్బ తగిలినా
అమ్మే.
ఎందుకంటే..
అమ్మే
ఆధారం..
ఆసరా.
సృష్టి
కలయికలో తనలో
రూపొందిన జీవం
రూపమేదో కూడా
తెలియకముందే
తన ప్రేమ
ప్రారంభం
అవుతుంది.
కడుపులో
అభివృద్ధి
చెందుతున్న
రూపాన్ని
కంటికిరెప్పలా
కాచుకుంటుంది.
బిడ్డ
క్షేమం కోసం
తన ఇష్టాఇష్టాలను
పక్కన
పెట్టేస్తుంది.
కనిపించిన
ప్రతి దేవుడికీ
మొక్కుతుంది.
ఇలా
భూమి మీదకు
రాకముందే
మాతృమూర్తి
అవుతుంది.
తన
మనసులో అమృతాన్ని
నింపుకుంటుంది.
ఒక్కో
నెలను
లెక్కేసుకుంటూ..
బిడ్డ
పెరుగుదలను
అంచనా వేసుకుంటుంది.
చిన్నపాటి
కదలికలకే
లోకంలో ఇంకెక్కడా
జరగని వింతని
మురిసిపోతుంది.
పుట్టే
బిడ్డ దబ్బపండు
రంగులో ఉండాలంటూ
కుంకుమ పువ్వనీ,
నారింజ
పండ్లనీ
తింటుంది.
పేగుబంధాన్ని
ముడివేస్తూ..
తామిద్దరూ
ఒకటే అని
మురిసిపోతుంది.
నెలలు
నిండుతున్న
కొద్దీ..
వస్తున్న
ఆయాసాన్ని
పంటిబిగువునే
దాచి,
పైకి
మాత్రం నవ్వులు
చిందిస్తుంది.
బాధనైనా
సంతోషంగానే!
ఒక
మనిషి సాధారణంగా
భరించగలిగే
నొప్పికంటే
కొన్ని రెట్లు
ఎక్కువ నొప్పిని
భరిస్తుంది
తల్లి పురిటి
సమయంలో.
వైద్యులను
సైతం విస్మయపరిచే
విషయమిది.
అంతటి
బాధనీ పంటి
బిగువన
నొక్కిపట్టి,
బిడ్డ
రాకకోసం
ఎదురుచూస్తుంది.
అప్పటికీ
బిడ్డ క్షేమమే
ఆమె లక్ష్యం.
నవమోసాలు
మోసి,
ఎంతో
ఎదురుచూసిన
ఆ జీవి
బయటకు రాగానే..
ఈ
లోకాన్నే
జయించినట్లుగా
మురిసిపోతుంది.
తన
కంటి నుంచి
కన్నీళ్లు
ధారలుగా
కడుతున్నా..
మోహంలో
చిరునవ్వులు
చిందిస్తూ,
పొత్తిళ్లలోని
చిన్ని ప్రాణాన్ని
మురిపెంగా
చూసుకుంటుంది.
పేగు
తెంచినంత
మాత్రాన
మనిద్దరం వేరు
కాలేదనీ,
ఒకే
హృదయం రెండు
వేర్వేరు
రూపాల్లో
ఉన్నామని
బిడ్డకి బాస
చేస్తుంది.
అదేగా
అమ్మ ప్రేమ!
ఆమె
ఒడేగా
వెచ్చటి
పాన్పు
కడుపులో
నుంచి భూమి
మీదకి వచ్చాక
తల్లి ఒడే
బిడ్డకి పాన్పు.
ఆమె
వెచ్చని
శ్వాసతోనే
బిడ్డకి ఈ
కొత్త లోకపు
పరిచయం కలిగేది.
ఆ
చిన్ని పాపాయి
గుక్క పెట్టి
ఏడిస్తే ఆమె
గుండె
ఆగిపోయినట్టుగా
విలవిలలాడుతుంది.
రొమ్ము
పాలిచ్చి
అక్కున
చేర్చుకుంటుంది.
బిడ్డ
కడుపు నిండితే
తన కడుపు
నిండినట్టుగా
భావిస్తుంది.
లాలపోసి,
జోలపాడి
నిద్రపుచ్చుతుంది.
అందంగా
ముస్తాబు
చేసి,
లోకంలో
తన బిడ్డను
మించిన అందం
మరేదీ లేదంటూ
మురిసిపోతుంది.
వెంటనే,
తన
దిష్టే
తగులుతుందేమోనని
దిష్టిచుక్క
పెడుతుంది.
తన
అపురూప వస్తువును
అందరికీ
మురిపెంగా
చూపడానికి
బారసాల చేస్తుంది.
ఉయ్యాలలో
తన కంటిపాపను
వేసి,
పండగ
చేస్తుంది.
వచ్చిన
ముత్తైదువులందరూ
తన బిడ్డను
చల్లగా దీవించాలని
కమ్మని వంటలతో
వాళ్ల కడుపు
నింపుతుంది.
అందరూ
తన పాపని
దీర్ఘాయురస్తు
అని దీవిస్తుంటే..
కళ్లతోనే
కృతజ్ఙతలు
తెలియజేస్తుంది.
ఆ
చిన్ని పాపాయి
కాళ్లు ఆడిస్తూ,
చేతులు
ఊపిస్తూ నోరు
ఆడిస్తుంటే,
తన
బుజ్జాయి
తనకేదో
చెబుతోందంటూ..
తెగ
సంబర పడుతుంది.
కాళ్లతో
తన ఎదపై
తన్నినా హాయిగా
భావిస్తుంది.
ఊ
కొడుతున్న
పాపాయి ఊసులు
వింటూ..
ఎన్ని
రాత్రులు
జాగరణలో
జారుకుంటాయో!
పేరు
కోసం
ఎన్నిపాట్లు..
సృష్టిలో
పుట్టుక,
మాతృత్వం
రెండూ సహజమే.
కానీ
తల్లికి మాత్రం
అపురూపం.
అందుకే
తనకే దక్కిన
ఆ అపురూప
సంపదకు చక్కని
పేరును ఎంచడానికి
పెద్ద యాగమే
చేస్తుంది.
దీనిలో
ఎన్ని శోధనలు,
సంప్రదింపులు,
సలహాలు,
తిరస్కారాలో.
అమ్మకి
ఒక్కటీ నచ్చదే.
ప్రతిదానిలోనూ
ఆమెకి వంకలే
దొరుకుతాయి.
ఆమెకి
లభించిన అపురూప
వస్తువు అంత
అమూల్యం మరి
ఆమెకి.
అందుకే
అంతటి విలువైన
తన పాపకి
దానికి తగ్గ
పేరునే
ఎంచాలనుకుంటుంది.
పుస్తకాలు
తిరగేస్తుంది,
అంతర్జాలం
వెతికేస్తుంది..
చివరకి
తనకు నచ్చిన
పేరు దొరికినపుడు
ఆమె సంబరం
అంబరాన్ని
తాకాల్సిందే!
అది
కూడా తన
పాపకు ఇచ్చే
విలువైన
బహుమతిగానే
భావిస్తుంది
తల్లి.
బుడిబుడి
అడుగులు..
తొలి
పలుకులు..
పాప
ఎదిగే క్రమంలో
పారాడుతూ తన
వెనుకనే
తిరుగుతుంటే..
అమ్మతోడిదే
తన పాపాయి
లోకమంటూ
సంతోషిస్తుంది.
ఆ
చిన్నారి
బుడిబుడి
అడుగులేస్తుంటే
.. ఆ
చిన్ని చేతులకు
తనే ఊతమవుతుంది.
తన
చిన్నారి గడప
దాటిందంటూ..
అడుగులేసిందంటూ..
నలుగురికీ
అబ్బురంగా
చెప్పుకుంటుంది.
ఇదే
అపురూపమైన
క్షణమంటూ
పొంగిపోతుంటుంది.
ఆ
క్రమంలో తన
పాపాయి కిందపడి
దెబ్బతగిలించుకుంటే..
తన
గుండెనెవరో
మెలిపెట్టినట్టుగా
బాధపడుతుంది.
మళ్లీ
తానే ధైర్యమై
బిడ్డను
నడిపిస్తుంది.
అమ్మ
కాకముందు వరకూ
తానే ఒక
ఇంట్లో గారాబంగా,
తల్లి
చాటు బిడ్డగా
పెరిగిన ఆమె,
తల్లి
అవుతున్నానని
తెలియగానే ఆ
బాధ్యతలోకి
ఎలా ఒదిగిపోతుందో!
ఇక
తన పాపాయి
అమ్మా అని
పిలిచిన మొదటి
పిలుపును ఆ
తల్లి ఎంత
సంబరంగా
చేసుకుంటుందో.
పాపాయి
మొదట ఉంగా
ఉంగా అని
పిలిచే పిలుపు
తల్లికి అమ్మా
అన్నట్లు
వినిపిస్తుంది.
కానీ,
అది
ఉంగా అని
ఇంట్లో
పెద్దవాళ్లు
చెప్పినపుడు
ఆ తల్లి
ఎంత నిరుత్సాహపడుతుందో.
కానీ
మనసులో మాత్రం
తన చిన్నారి
అమ్మా అనే
అంటోందనుకుంటుంది.
చిట్టి
చిట్టి పలుకులు
పలుకుతూ ఆ
బుజ్జాయి
అమ్మా అని
పిలిచినపుడు
ఆ తల్లి
సంబరం అంబరాన్నే
అంటుంది.
ఆ
చిన్ని పిలుపుకే
తన జన్మ
సార్థకమైనట్లుగా
భావిస్తుంది.
తన
ఆనందాన్ని ఆ
చిన్నారి పాల
బుగ్గలపై
వెన్నెల్లా
కురిపిస్తుంది..
ఎంత
అల్ప సంతోషి!
బెస్ట్
చెఫ్
అడగనిదే
అమ్మైనా అన్నం
పెట్టదంటారు..
నిజంగా..
ఎంత
అబద్ధం?
అసలు
మనం అడిగే
వరకూ ఆగుతుందా
అమ్మ?
బిడ్డకి
ఏం కావాలో
అమ్మకి ప్రతిక్షణం
తన గుండె
చెప్తూనే
ఉంటుంది.
పాపాయికి
అన్నప్రాశన
పండగ చేసి,
ఏ
సమయంలో ఏం
పెట్టాలో
చక్కగా
పాటిస్తుంది.
ఆరుబయట
చల్లగాలిలో..
వెన్నెల
బువ్వలను గోరు
ముద్దలు చేసి
తినిపిస్తుంది.
ఊసులు
చెబుతూ తినిపించే
బువ్వలో అమ్మ
చేతి కమ్మదనం
తోడైనపుడు
అమృతం కూడా
దిగదుడుపే
కదా.
పెరుగుతున్న
వయసుకుతోడు
పిల్లల అభిరుచులు
మారుతుంటే..
ఎప్పటికప్పుడు
వాటిని అర్థం
చేసుకుంటుంది.
తానూ
వాటికే అలవాటు
పడాలనుకుంటుంది,
అలవాటు
చేసుకుంటుంది.
వారికి
నచ్చింది
చేసిపెట్టడానికే
తాపత్రయపడుతుంది.
ఆమె
చేసిన వాటిని
తన పిల్లలు
ఇష్టంగా
తింటుంటే..
ఎవరెస్ట్
శిఖరాన్నే
అధిరోహించినట్టుగా
సంబరపడుతుంది.
ఆ
ఆనందంతోనే
కడుపు
నింపేసుకుంటుంది.
అయిదు
నక్షత్రాల
హోటళ్లో తిన్నా,
పంచభక్ష్య
పరమాన్నాలు
ఉన్నా..
అమ్మ
చేతి వంటకు
ఉన్న మాధుర్యం
రాదెందుకో?
ఒకే
కూరను అమ్మ
కలిపి ఇచ్చినపుడు
వచ్చిన రుచి,
స్వయంగా
కలుపుకున్నపుడు
రాదు.
బహుశా
అమృతమే ఆమె
చేతిలో
ఉండుంటుంది.
అందుకే
సృష్టిలో
ఎన్ని వందల,
వేల
వెరైటీలున్నా..
ఎన్ని
కొత్త రుచులున్నా
అమ్మ చేతి
వంటే వేరు..
ఆ
రుచే వేరు.
అందుకేనేమో
ప్రతి ఒక్కరికీ
వాళ్ల అమ్మే
ఫేవరెట్
చెఫ్.
స్నేహితురాలు-
గురువు
ఆటలాడే
సమయంలో ఆమే
ఒక స్నేహితురాలు,
ఆమె
కొంగే ఒక
ఆట వస్తువు.
చిన్నారి
చిట్టి చిట్టి
పలుకులను
ప్రారంభించి,
తనను
అనుకరిస్తున్నపుడు
ప్రేమనే
పాఠాలుగా
బోధిస్తుంది.
బంధాలను
పరిచయం చేస్తుంది.
చిన్న
చిన్న పదాలను
వల్లె వేయిస్తుంది.
చిట్టి
చిలకమ్మ..
వానా
వానా వల్లప్ప
అంటూ గేయాలు
నేర్పుతుంది.
చిన్ని
చిన్ని కథలు
చెబుతూ బతుకు
నీతి పాఠాలు
బోధిస్తుంది.
పాపాయి
స్కూలుకు
వెళ్లే సమయం
వచ్చినపుడు
తల్లి కంగారు
పడుతుంది.
తన
ఒడిలో ఆడుకుంటూ,
తన
కొంగు పట్టుకుని
తిరిగే తన
చిన్నారి తనకు
ఒక్కసారిగా
దూరమవుతోందని
కంగారుపడుతుంది.
కానీ,
బిడ్డ
భవిష్యత్తును
ఆలోచించి,
తన
బెంగను
అదిమిపెట్టకుంటుంది.
నవ్వుతూనే
పాపాయిని
బడికి పంపుతుంది.
అయినా
అమ్మని మించిన
గురువు ఎవరు?
తన
వంటగదిని
మించిన పాఠశాల
ఏది?
చాటలోని
బియ్యంలో చేయి
పట్టుకుని
అ,
ఆలు
దిద్దిస్తుంది.
ఆరు
బయట కూర్చున్నపుడు
కర్రపుల్లను
చేతికిచ్చి
ఇసుకలో ఒంట్లు
రాయిస్తుంది.
లెక్కల్లో
తికమక పడుతుంటే..
మళ్లీ
వంటగదిలోని
వేరుశెనగ
గింజలో,
అమ్మ
చేతి వేళ్లు
అరువిచ్చి
జవాబులు ఇట్టే
తెప్పిచ్చేస్తుంది.
పెరట్లో
మొక్కలతో
సైన్స్ పాఠాలను
చెప్పేస్తుంది.
కథలతో
రాణి రుద్రమ,
వీరేశలింగం,
అక్బర్‌ల
జీవితచరిత్రను
తిరగేస్తుంది.
అందుకే
బాల్యంలో
పిల్లలకు
అమ్మే ఒక
అద్భుతం.
అమ్మే
కౌన్సెలర్
కాలంలోనూ
ఎన్నో మార్పులు..
నిన్నటి
అమ్మ ప్రేమ,
పెంపకానికి
పరిమితమైతే..
నేటి
అమ్మ తమ
పిల్లల కోసం
కాలానికి
తగ్గట్టుగా
మారిపోయింది.
చిన్నప్పుడు
దెబ్బలతోనో,
బుజ్జగింపులతోనో
సర్దిచెప్పే
అమ్మ పిల్లలు
యౌవనంలోకి
రాగానే ఒక
మంచి కౌన్సెలర్
పాత్ర పోషిస్తుంది.
సమాజాన్ని
వివిధ కోణాల్లో,
కొంగొత్తగా
పరిచయం చేస్తుంది.
అమ్మాయి
రజస్వల కాగానే
శరీరంలోని
మార్పులతోపాటు,
మానసిక
మార్పుల్లో
తేడానూ
గమనిస్తుంది,
హెచ్చరిస్తుంది.
అబ్బాయి
ప్రవర్తననూ
ఓ కంట
గమనిస్తుంది.
స్నేహితురాలిగా
మారడానికి
ప్రయత్నిస్తుంది.
అవసరమైన
సందర్భాల్లో
సలహాలు,
సూచనలు
ఇస్తుంది.
అప్పటిదాకా
ఉన్న క్రమశిక్షణపూర్వక
వాతావరణాన్ని
స్నేహం దిశగా
మారుస్తుంది.
ఎవరో
అన్నట్టు
మార్పు ఇంటి
నుంచే ప్రారంభం
అవుతుంది.
దాని
పేరే అమ్మ.
అప్పటి
వరకూ చిన్నపిల్లలుగా
ఉన్నవారిని
పౌరులుగా
తీర్చిదిద్దడానికి
ప్రయత్నిస్తుంది.
అందుకే
అమ్మ ఒక
రోల్ మోడల్..
పిల్లల
వ్యక్తిత్వాన్ని
తీర్చిదిద్దే
ఫేమస్
కౌన్సెలర్.
విజయాలు-
అపజయాలు
ఉద్యోగ
బాధ్యతలను
నిర్వహిస్తూనే,
పిల్లల
బాధ్యతలను
బ్యాలెన్స్
చేస్తున్నవారెందరో!
పదిమందిని
శాసించే
స్థాయిలో
ఉన్నా..
పిల్లల
కష్టాన్ని
చూసి కళ్లు
చెమర్చుకునే
మనసు అమ్మది.
నిజంగా
ఇది ఆమె
చిన్నపిల్ల
మనస్తత్వానికి
ఉదారణే.
అయినా..
దాన్ని
వాళ్లకి
కనిపించనివ్వదు..
వారిలో
ఎన్నిలోపాలున్నా
ప్రేమించగలుగుతుంది.
బిడ్డ
గెలుపును తన
గెలుపుగా
భావిస్తుంది..
ఓడినప్పుడు
తన చేతిని
ఆసరాగా ఇస్తుంది.
గెలిచినపుడు
చాలామంది
వెన్నంటే
ఉంటారు.
ఓడినప్పుడు
కూడా తోడు
నిలిచేది
అమ్మే.
పెళ్లి
చేసి పంపేటప్పడు
అమ్మ తన
తల్లి దగ్గర్నుంచి
తెచ్చుకున్న
విలువలను తన
కూతురికి
ఆస్తిగా
ఇస్తుంది.
ఇంటికి
తెచ్చుకున్న
అమ్మాయిని
ఎలా గౌరవంగా,
ప్రేమగా
చూసుకోవాలో
అబ్బాయికి
తెలియజేస్తుంది.
ఆమె
నేర్పే ఈ
జీవితపాఠాలే
వారి భవిష్యత్తుకు
బంగారు బాటలు
వేసేలా
దోహదపడతాయి.
అమ్మమ్మయ్యాక
...
కొత్తగా
మాతృత్వాన్ని
పొందిన తన
పాపాయి జీవన
పథంలోకి
అడుగుపెట్టినపుడు..
ఆమెనీ
ఓ చంటిపాపలా
చూసుకుంటూనే
ఆమె కంటిపాపనూ
లాలిస్తుంది.
ఈ
కొత్త బాటలో
కంగారుపడుతున్న
కూతురిని తన
అనుభవాలతో
సరికొత్త
అమ్మగా
తీర్చిదిద్దుతుంది.
'అమ్మ'
ప్రయాణాన్ని
ఎలా సుగమం
చేసుకోవాలో
బోధిస్తుంది.
దాన్ని
ఆనందదాయకంగా
మలచుకోవాలో
సూచిస్తుంది.
దానికి
ఆమె చేయాల్సిన
కృషిని అనుభవాలతో
రంగరించి
చూపిస్తుంది.
ఇంతటితో
ఆగుతుందా ఆమె
పయనం?
లేదుగా..
మళ్లీ
పుట్టిన మనవళ్లు
మనవరాళ్లు..
వాళ్లకి
కథలు ఇలా
కొనసాగుతూనే
ఉంటుంది..
అందుకే
అమ్మ ఒక
తరగని గని.
అసలు
అమ్మని
నిర్వచించడం
ఎవరికైనా
సాధ్యమేనా?
అమ్మకి
అర్థం చెప్పడమంటే..
లోకంలో
ప్రేమనంతటినీ
రాశిగా పోయడమే.
అయినా
అది కూడా
ఆమె ముందు
తూకానికి
తక్కువే.
అమ్మకి
అర్థం,
పరమార్థం,
ఆది,
అంతం
మళ్లీ అమ్మే.
జీవిత
పయనంలో ఆమెది
ప్రత్యేక
స్థానం.
అందుకే
అందరూ ప్రతిక్షణం
అమ్మ ప్రేమనే
కోరుకుంటారు.
అలాంటి
అమ్మకి మనం
తిరిగి
ఇవ్వగలిగింది
ఏమైనా ఉందా?
కృతజ్ఞతలు
చెప్పడం
మినహా..!
చెబుదామా
మరి..
అమ్మా..
థాంక్యూ
అని?!
Subscribe to:
Posts (Atom)
‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)
నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...

-
నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...