Tuesday 31 December 2013

ఈమెకి సాటెవ్వరు?


మారథాన్ లో గెలవడం మామూలు విషయమే.. మహిళలు గెలవడమూ సాధారణమే. కానీ ఆరుపదుల వయసులో.. చీరకట్టులో.. అదీ చెప్పులు లేకుండా! శెభాష్ అనకుండా ఉండగలరా ఎవరైనా? లతాకారే.. ఫేస్ బుక్, న్యూస్ పేపర్లలో ఇప్పుడీమే గురించే హల్ చల్ జరుగుతోంది.

గెలుపంటే ఎవరికైనా మోజే.. కానీ ఈమెది మోజు కాదు.. ఒక సంకల్పం. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న తన భర్త వైద్యం కోసం ఈమె ఈ సాహసానికి ఒడిగట్టింది. మారథాన్ లో గెలిచిన వారికి ఇచ్చేది పెద్ద మొత్తమేం కాదు. అయినా ఎంతోకొంత సాయపడదా అనుకుని మరీ పాల్గొనింది. చిన్న చిన్న లోపాలను చూసుకుని నిరాశలో కూరుకునిపోయే యువతకు ఈమె స్ఫూర్తి అనడంలో సందేహం ఉండదేమో..!



4 comments:

Sudhakar said...

Inspiring story !
మీ బ్లాగు బాగుంది ,మీ పేరు తో పాటుగా !
రాయండి మీరు మరి తరచు గా !
అభినందనలు !
సుధాకర్

Sudhakar said...

మీ బ్లాగు బాగుంది ,మీ పేరు తో పాటుగా !
రాయండి మీరు మరి తరచు గా !
అభినందనలు !
సుధాకర్

Sudhakar said...

మీ బ్లాగు బాగుంది ,మీ పేరు తో పాటుగా !
రాయండి మీరు మరి తరచు గా !
అభినందనలు !
సుధాకర్

anu said...

Thank you Sudhakar Anumanchi garu..

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...