Thursday 17 October 2013

నేను తీసిన ఫొటో..!


తెల్లవారుజాము.. అప్పుడే భూమిపై ప్రసరిస్తున్న సూర్యకిరణాలు.. ఆ లేత కిరణాలు భూమిని చేరుతోంటే తొలిగిపోతున్న మంచుతెరలు..  భానుడికి స్వాగతమన్నట్లగా పిల్లగాలికి హొయలు పోతున్న చెట్లు.. ఇలా ఉంటుంది కదా ఏ కవి సూర్యోదయ వర్ణనైనా.. ఈ ఫొటో కూడా ఆ వర్ణనకు తగ్గట్టుగానే ఉందనిపిస్తోంది కదూ! కానీ ఇది మాత్రం సూర్యాస్తమయంలో తీసినది.
 
క సాయంత్రం ఖమ్మం పక్కన ఉన్న ఊరెళ్లాను.. రిపోర్టింగ్ పనిలో భాగంగా.. అప్పుడు  ఈ దృశ్యం కనిపించింది. అంతే.. నా ఫోన్ లో బంధించాను.  

కొబ్బరి చెట్ల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు.. అచ్చం కోనసీమను తలపిస్తోంది కదూ...!


4 comments:

Unknown said...

Life lo 1st time aa photo tiyadam ha.....malli daniki oka kavithvam.... andaru nala kalathmaka hrudayam tho chudaru amma

వేణు said...

బాగుంది ఫొటో. వ్యాఖ్య కూడా!

anu said...

Kishore pv ..మొదటిసారేమీ కాదుగానీ మనం తీయాలనుకున్నపుడు ఇలాంటి ఫొటోలు రావుగా.. సమయం కలిసొచ్చింది.. తీశాను.. మీతో పంచుకోవాలనుకున్నాను.. అందుకే బ్లాగులో పెట్టాను..

anu said...

ధన్యవాదాలు వేణు గారూ..

‘వి’జయమేనా? (‘వి’ సినిమా రివ్యూ)

  నానీ విలన్ , సుధీర్ హీరో సినిమా యూనిట్ చెప్పిన మాట / వచ్చిన టాక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది . నేచురల్ స్టార్ అయినా ఎప్పుడూ పక్కింటి...